తప్పెవరిది?
ఎం కోరుకుంది తను?
ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ఆసించలేదే
స౦పదలన్నీ తనకు మాత్రమే చెందాలని కోరుకోలేదే
సమస్త గ్రహాల్ని తన చుట్టూ తిప్పుకోవాలని కలగనలేదే?
ఆమె కోరిందల్లా
ఓ గుప్పెడు ప్రేమా
ఓ నాలుగు కన్నీటి చుక్కలే కదా!
అది పెద్ద అత్యాశ కాదే
అసలు ఆశే కాదు కదా
అతని చుట్టూ ఓ ర౦గుల హరివిల్లును నిర్మించుకోవడం
ఆమె చేసిన తప్పా?
అతని చిరునవ్వుల పందిరి క్రింద సేద తీరాలనుకోవడం
ఆమె చేసిన నేరమా?
దేవుడా
నువ్వెంత చెడ్డవాడివి
మంచి నీటి ప్రవాహాల్ని సముద్రంలో కలిపెస్తావ్
అద్భుత సౌదర్యమైన అడవిని
క్రూర జ౦తువులతో ని౦పేస్తావ్
నీ సృష్టి రహశ్యాల్ని చూడకుండా
సగం కాలాన్ని చీకటిలో దాచేస్తావ్
అసలు
నీలో అంతో ఇంతో చెడ్డ లేకపోతే
చెడ్డవాళ్లనెలా సృష్టిస్తావ్??
No comments:
Post a Comment