మరొక్కమారు సూర్యుడు ఉదయిస్తాడు
ఔనన్నా కాదన్నా
ఒక మొదలు ఉన్నట్లే
ఒక చివర కూడా వుంటుంది
వెలుగు చికట్లలాగా
జనణ మరణాల్లాగా
ఒక చివరి రోజుంటుంది
ఆ చివరి దినం చివరి క్షణ౦ తరువాత
ఉదయించే సూర్యుడు - నిమిషాలు - గంటలు - రోజులు
ఏవీ ఉండక పోవచ్చు!?
అప్పుడిక
నువ్వెక్కడిను౦డి వచ్చావు
ఏ దారుల వెంట నడిచొచ్చావు
ఏ రెక్కలు కట్టుక వాలావన్నది
అప్రస్తుత మవుతుంది
అంతేగాక
నీ అందానికి
తెలివితేటలకు
విలువు౦డకనూ పోవచ్చు
ఇంకా చెప్పాలంటే
నువ్వు
ఆడా మగా
తెలుపా నలుపా
అన్నదికుడా అప్రస్తుతమవుతుంది
అప్పుడిక నీ విజయాలకూ విలువుండక పోవచ్చు
కాని
ఇతరుల బాధల్లో
నువ్వు కార్చిన కన్నీటి చారలు మాత్రం
చిరకాలం మిగిలుంటాయి
ఇంకా
నువ్వు నేర్చుకున్న వాటికి గుర్తింపు ఉండక పోవచ్చు
కాని
నువ్వు నేర్పి వెళ్ళింది మాత్రం
తరాలుగా కొనసాగుతూనే వుంటుంది
నీ నిజాయితీ ఆర్ద్రత ధైర్యం
ఇక్కడ మిగిలి పోతాయి
నువ్వు జీవించి వున్నప్పుడు
నీకెంతమంది పరిచయమన్నది ముఖ్యం కాదు
నువ్వు మరణించిన తరువాత
నిన్నె౦తమ౦ది పోగొట్టుకున్నారన్నది అతి ముఖ్యం
ఏదేమైనా
కడసారిగా
మరొక్కమారు సూర్యుడు ఉదయిస్తాడు!
(ఓ ఆ౦గ్ల కవితకు స్వేచ్చానువాదం)