నాకు తెలుసు
నాకు
ప్రవహించడమే కాదు
పలకరించడము తెలుసు
మల్లె తోటపై పరుగెడుతున్న పిల్ల తెమ్మెరలా
పంట చేలపై తేలియాడుతున్న జానపదంలా
హృదయాన్ని తాకడము తెలుసు
నిదురిస్తున్న ఉదయాన్ని
కళ్లాపిలా తట్టి లేపడము తెలుసు
నాకు
పలకరించడమే కాదు
ప్రవహి౦చడమూ తెలుసు
బింధువులా మొదలై
సెలయేరులా సాగి
జలపాతంలా దూకి
సముద్రంలా ఉప్పొ౦గడమూ తెలుసు
మనసు పొరల్లోకి దూరి
మమతల తిగల్నిమీటి
పున్నమి వెన్నెలలా ప్రవహి౦చడమూ తెలుసు
నాకు
అందరినీ పలకరి౦చడమూ తెలుసు
అందరిలోకి ప్రవహి౦చడమూ తెలుసు
ఎండిన చెరువులోకి ఊటలా ఉబకడమూ తెలుసు
వడలిన ఆకులోకి
జివరసంలా ప్రాకడమూ తెలుసు
నాకు
ప్రవహి౦చడమూ, పలకరించడమే కాదు
ప౦చుకోవడమూ తెలుసు
No comments:
Post a Comment