కొంచెం ఆచూకీ చెప్పవూ?
విస్తరించిన ఎడారి ఇసుక రేణువులకు
హరిత స్వప్నాలు పూయించి
ఏ ఖర్జూర వృక్ష క్షాయల క్రింద
సేద తిరుతున్నావో ?
ఉదృత తుఫానులను పిడికిట బంధించి
ధరిత్రిపై కల్లాపి జల్లి
ఏ మట్టి పరిమళాన్ని పీలుస్తూ
పారవశ్యంలో మునిగిపోయావో?
అడవి అంతా తిరిగి
పూవుపూవునూ పలకరించి
పూల కీలాగ్రాల తేలియాడుతున్న పుప్పోడులను మేల్కొలిపి
ఏ పూరేకు చాటున నిదురోతున్నావో?
మేఘాలతో స్నేహించి
సెలయేళ్ళతో చెలిమిచేసి
జలపాతాలతో జతకట్టి
ఏ సముద్రపు నీలి తెరలక్రింద యోగనిద్రలో మునిగావో?
ఇక్కడ
ఈ జనారణ్యంలో
ఒయాసిస్సునై
పత్ర హరితాన్నై
పుప్పోడినై
నీటి బింధువునై
ఎదురుచూస్తున్నా !!
No comments:
Post a Comment