నేను మాత్రమే
నా మదిలో
కదలుతున్న భావాలను
అక్షరాలుగా పేర్చేఅవిశ్రాంత ఘడియల్లో
నా హృదయం ఎన్ని ముక్కలుగా కత్తరించబడిందో
నాకు మాత్రమే తెలుసు!
తెగి పడ్డ
ఒక్కొక్క ముక్క
స్రవించిన రక్తనాలాలన్నీ
ఒక్కొక్క రక్తపుటేరుగా
ఈ ధరాతలాన్ని
ఎన్ని మార్లు చుట్టి వచ్హాయో
నేను మాత్రమే చూశాను!!
అందుకే
మాత్రు గర్భంలో
చైతన్యం పొందిన బీజం
పరిపూర్ణ రూపాన్ని సంతరించుకొని
ధరిత్రిపైకి జారుతున్న వేల
అనంత సాగర ఘోష
ఓ క్షన౦ ఆగిపోయేలా
అమ్మ అవుతున్న ఆమె
' అమ్మా ' అని అరిచినప్పుడు
జరించిన శబ్ద తరంగ దైర్ఘ్యాన్ని
ప్రశాంత మైదానాల పచ్చదన౦లా
ఆనంద పారవశ్యంలో మునిగినప్పుడు
సన్నగా విచ్చుకున్న అధరాలపై
మెరిసే దరహాస లిపిని
నేను మాత్రమే చదువగలను!!!
No comments:
Post a Comment