ఎడారి పూవు
ఎన్ని కలాముల మెదల్లలో౦చి
రాలి పడ్డ న్యూరానుల కలయికయో
ఈ హైందవ భూమిలో జనించిన
అణు విత్తనం!
మండుటెండల్లో
ఇసుక తుఫానుల సాక్షిగా
ప్రొక్రాన్ ఎడారిలో
పుష్పించగా
వెదజల్లిన పరిమళాలు
ఈ జాతి స్వరాల్లో
ఆనందాన్నీఆత్మస్థైర్యాన్ని నింపగా
పరజాతి నరాల్లో
అలజడిని అసూయను సృష్టిస్తుందని
ఈ శాంతి కపోతాల కే౦తెలుసు?
ప్రపంచమా
అహంకారంతో నల్లబారిన రెటీనాను దాటి
మీ మమతలపై కప్పుకున్న
ఛా౦దసపు ముసుగులను తొలగి౦చి
రేపటి ఉషోదయంలోంచి
ఒక్కసారి ఇటు చూడు
అప్పుడు తెలుస్తుంది
ఇక్కడ ధరించే ఆయుధం
ఆత్మరక్షణ కేనని
ఇక్కడ పఠించే మంత్రం
ధర్మరక్షణ కేనని
ఇక్కడ భరించే సహనం
హిమాలయమంతని
ఇక్కడ ఆశించే జీవన౦
వసుధైక కుటు౦భ౦ కోసమేనని!
No comments:
Post a Comment