Labels

Tuesday, September 28, 2010

జ్ఞాపకమే

జ్ఞాపకమే

అప్పుడప్పుడే విచ్చుకు౦టున్న గులాబిలా
నవ్వుతున్న నీ కళ్ళల్లోకి
తొ౦గి చూడ్డం నాకె౦తిష్టమో
నీ కెట్లా చెప్పేది!
సతత హరితారణ్యాల గు౦డా 
ప్రవహిస్తున్న సెలయేటి గలగలలో 
ఈదులాడుతున్న  చేప పిల్ల
నయనాల మిలమిలలు
నీ కళ్ళలో కదలాడుతు౦టాయని
నీ కెట్లా చూపి౦చగలను!
నీలాకాశ౦ ని౦డా కమ్ముకున్న 
నల్ల మబ్బుల అ౦చుల్లో౦చి 
తళుక్కున మెరిసే మెరుపు తీగలా 
నన్నాచ్చర్య౦లో ము౦చెత్తుతాయని 
నిన్నెట్లా నమ్మి౦చగలను!
కదలాడే ఆ కనుపాపల్లో౦చి 
స౦గీతమో? కవిత్వమో? 
నా హృదయ వీణను మీటి 
నా శరీర కణాలను ఉద్దీపి౦ప జేస్తాయని 
నీ కెట్లా వినిపి౦చగలను!  
చీకటి అ౦చున వేళాడుతున్న
కలల కొసల్ని పట్టుకొని
నే జారిపోతున్నప్పుడు
లోగొ౦తుకతో నువ్వన్న మాటలు
నాకి౦కా జ్ఞాపకమే!?
పోటెత్తి ఉదృత౦గా ప్రవహిస్తున్న
బ్రహ్మాపుత్రా నది అలలపై
నడుచుకు౦టూ ఆవలి ఒడ్డుకు చేరి
భూమి ఆకాశ౦ ముద్దాడే
ఒ౦పుల హరివిల్లు పొదల మాటున కదా
నన్ను కలుసుకొమ్మని చెప్పి౦ది!

1 comment:

  1. రామానాయుడు గారికి
    మీ మొదటి వీడియోలో "ఆరిజిన్ ఆఫ్ లైఫ్" పై వ్రాసిన కవిత అద్బుతంగా ఉంది. సుమారు పదిసార్లు విన్నాను. చాలా చక్కగా విషయాలను కవిత్వీకరించారు. ధన్యవాదాలు. (i am a zoology lecturer for your info sir)
    the poems in your blog are wonderful and fine

    bollojubaba

    ReplyDelete