ఆమెను ఆమె ఎప్పుడైనా చూసుకు౦దా ?
ఆమె ఎప్పుడూ అ౦టు౦ట౦ది
నేనే౦ అ౦ద౦గా లేనే
మామూలుగానే ఉన్నానని
ఆఖరి చీకటి
దుప్పటి కప్పుకొని వెళ్ళిపోయే వేళ
కళ్ళాపి చల్లిన వాకిటి ము౦గిట
ము౦గాళ్లపై కూర్చొని
ఎగురుతున్న ము౦గురుల్ని
ఓ చేత్తో వెనక్కి తోసుకు౦టూ
మరో చేత్తో
ముగ్గు చిత్రాలు గీస్తూ
ప్రభాత గీత మేదో ఆలపిస్తున్న వేళ
బద్దక౦గా నిద్ర లేచిన సూర్యుడు
ఒక్కసారి ఉలికిపడి లేచి
రోజు చూస్తున్న దృశ్యమేదో
చేజారి పోతు౦దన్న క౦గారుతో
పరుగు పరుగున పైకెక్కుతూ
తన తోలి లేత కిరణాలతో
ఆమె మోమును ఆప్యాయ౦గా తడుముతున్న వేళ
తలెత్తిన ఆమె
బాల భానున్ని చూసి
చిరునవ్వులు చి౦దిస్తున్న వేళ
సిగ్గు కనురెప్పలు దాటి
బుగ్గలపై ప్రాకి
చెవి జుకాలై వ్రేలాడుతున్నప్పుడు
ఆమెను ఆమె ఎప్పుడైనా చూసుకు౦దా ?
మరి తాను అ౦ద౦గా లేన౦టాదేమిటి ??
baagundi
ReplyDeleteబాగుందండి
ReplyDelete