Labels

Thursday, May 13, 2010

నేను - వాడు

నేను - వాడు

పద్యం మత్తులో నేను
మద్యం మత్తులో వాడు
నన్ను నేను పద్యీకరి౦చుకు౦టున్నాను
వాడేం చేస్తున్నాడో తెలియదు

పదం మత్తులో నేను
మదం మత్తులో వాడు
పదంతో ప్రప౦చాన్ని పలకరిస్తున్నాను
వాడేం చేస్తున్నాడో తెలియదు

కలం కౌగిలిలో నేను
కాంత కౌగిలిలో వాడు
కలంతో కాలజ్ఞానాన్ని లిఖిస్తున్నాను
వాడేం చేస్తున్నాడో తెలియదు

అనుభూతిలో నేను
భౌతికానందంలో వాడు
నేను వాడిలా బ్రతకలేను
వాడు నాలా మారనూ లేడు
వాడు వాడే
నేను నేనే
పక్క పక్కనే పయనిస్తున్నా
కలవని రైలు పట్టాలం
అయినా మే మిద్దరం
అవనికి చుట్టాలం !

3 comments:

  1. "కలవని రైలు పట్టాలం
    అయినా మేమిద్దరం
    అవనికి చుట్టాలం !"

    బాగుంది. మంచి పద ప్రయోగం.

    ReplyDelete
  2. బెల్లంకొండ శ్రీకాంత్ గారికి,
    మీరు చదివారు. సంతోషం.
    వాడు ఎవరని అడిగారు కదా. నేను తప్ప ఎవరైనా కావచ్చు!!!!

    ReplyDelete