సాద్యంలాగుంది
అక్షరాలతో మాలను అల్లాలని వుంది
హారంగా నీ మెడలొ వేయాలని వుంది
అణుబాంబులు చేతపట్టి నడవాలని వుంది
పావురమై నీ ఒడిలో వాలాలని వుంది
అరుణ బింభమై నీ ముంగిట మురవాలని వుంది
ఆ పాపిట కుంకుమగా మెరవాలని వుంది
పిడికిటిలో చీకటినే పట్టాలని వుంది
నీ నయనాలకు కాటుకగా పెట్టాలని వుంది
గోరి౦టగ నీ పెరటిన పెరగాలని వుంది
చిరు పాదాలకు పారాణిగ పూయాలని వుంది
కళ్ళు రెండు దివ్వెలుగా పెట్టాలని వుంది
శశి మోమున హారతిగా పట్టాలని వుంది
అనుక్షణము నీ మోమునె చూడాలని వుంది
మూత పడని కనురెప్పల నే కోరాలని వుంది
యుగ యుగాలు నీతోనే గడపాలని వుంది
వేయి జన్మలెత్తితేనె సాద్యంలాగుంది
No comments:
Post a Comment